Newsminute24

అదరగొట్టిన వార్నర్.. ఢిల్లీ చేతిలో పంజాబ్ చిత్తు..!

ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఓకే వికేట్ కోల్పోయి సాధించింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. అజట్టులో కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్ (24), జితేష్ శర్మ (33) మినహా మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, అక్షర్‌ 2, కుల్‌దీప్‌ 2, లలిత్ యాదవ్ 2, ముస్తాఫిజర్‌ చెరో వికెట్ తీశారు.
అనంతరం 116 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఢిల్లీ 10.3 ఓవర్లలోనే చేదించింది. ఆ జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (41) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.

Exit mobile version