Site icon Newsminute24

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చరణ్ ఫస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. గొప్ప లక్షణాలు ఉన్న మా సోదరుడు అంటూ స్పందించాడు. ఇక బర్త్ డే బాయ్ రామ్ చరణ్ స్పందిస్తూ.. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని స్పష్టం చేశాడు.

Exit mobile version