Newsminute24

ముఖ్యమంత్రి మార్పు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ బహిరంగ సమావేశంలో మాట్లాడే నేతలకు చురకలు అంటిచారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఇంకోసారి ఎవరైన ముఖ్యమంత్రి మార్పు పై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారు. మరో 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

మేయర్ ఎన్నిక సీల్డ్ కవర్లో..

జిహెచ్ఎంసి కొత్త మేయర్ ఎవరన్న ప్రశ్నకు మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. మేయర్ ఎన్నికకు సంబంధించి పార్టీ అధినేతకు రెండు పేర్లను సీల్డ్ కవర్లో కార్యవర్గ సమావేశంలో నేతలు అందజేసినట్లు సమాచారం. మరోవైపు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను ఈనెల 12న తెలంగాణ భవన్ కు రావాలనే పిలుపు నేపథ్యంలో మేయర్ ఎన్నిక లాంఛనా ప్రాయంగా కనిపిస్తుంది

సాగర్లో విజయం సాధిస్తాం..

త్వరలో జరగనున్న సాగర్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఘనం విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. గత ఆరున్నర ఏళ్లలో టిఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేసి గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థిని సాగర్ ఉపఎన్నిక రోజే ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.

Exit mobile version