Site icon Newsminute24

దిల్లీ పై రాజస్థాన్ విజయం!

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాయల్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) సూపర్ స్పెల్ తో అదరగొట్టాడు. ముస్తాఫిజుర్‌ 2, క్రిస్‌మోరిస్‌ ఒక వికెట్‌ తీశారు. కాగా, దిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా ఉండకపోవడం గమనార్హం. ఛేదనలో రాజస్థాన్ జట్టు‌ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్‌ మిల్లర్‌(62; 43 బంతుల్లో 7×4, 2×6), క్రిస్‌ మోరిస్‌(36*; 18 బంతుల్లో 4×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమైన వేళ మోరిస్‌ రెండు సిక్సర్లు బాది రాజస్థాన్‌కి అనూహ్య విజయాన్ని అందించాడు. దిల్లీ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, రబాడ 2, క్రిస్‌వోక్స్‌ 2 వికెట్లు పడగొట్టారు.

Exit mobile version