Newsminute24

సారంగా దరియా లిరిక్స్!

పల్లవి :

దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తేపు రైకలు మేరవ
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగా దరియా..
దాని ఎడమ భుజం మీద కడవ
దాని ఏజెంట్ రైకలు మేరవ
అది రమ్మంటే రాదురా సెలియా
దాని పేరే సారంగా దరియా..
చరణం 1:
కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్..
కొప్పుల మల్లే దండేల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్
నవ్వులో లేవురా ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్..
నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల్ పాకుల్..
మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్..
ఎర్రగా అయితదిరా మన దిల్ ..
చురియా చురియా చురియా అది సుర్మా పెట్టిన చురియా..
అది రమ్మంటే రాదుర సెలియా..
దాని పేరే సారంగా దరియ..
చరణం : 2
రంగేలేని నా అంగి జడ తాకితే అయితది నల్లంగి..
మాటల ఘాటు లవంగి మర్ల పడితే సివంగి..
తీగలు లేని సారంగి వాయించబోతే అది ఫిరంగి..
గుడియా గుడియా గుడియా అది చిక్కి చిక్కిని చిడియా..
అది రమ్మంటే రాదుర సెలియా..
దాని పేరే సారంగా దరియా..
దాని సెంపల్ ఎన్నల కురియా..
దాని సేవులకు దుద్దుల్ మెరియా..
అది రమ్మంటే రాదుర సెలియా..
దాని పేరే సారంగా దరియా..
దాని నడుమ్ ముడతల్ మెరియా..
పడిపోతది మోగోళ్ళ దునియా..

Exit mobile version