Site icon Newsminute24

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కలయికలో ఓ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. శంకర్ శైలిలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా  రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ లో  నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత చరణ్ పలువురు యువ దర్శకులతో నటిస్తారని వార్తలు వినిపించిన.. దీనిపై స్పష్టత రాలేదు. ఈ ప్రకటనతో ఊహాగానాలకు తెరపడినట్లయింది.

ఇక మెసేజ్ ఓరియెంటెడ్ తో పాటు గ్రాఫిక్స్ తో మాయచేసే శంకర్ నుంచి  వస్తున్న ఈ చిత్రంపై  అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన, ఐ, రోబో2  చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో.. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని శంకర్ ర్ ర్ తాపత్రయపడుతున్నాడు 

Exit mobile version