Newsminute24

న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్సై రాజశేఖర్ రెడ్డి

నల్లగొండ : కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్గొండ టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి సూచించారు  . ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎసై రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. 

ఇక  బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు  ఎసై రాజశేఖర్ రెడ్డి. తాగి రోడ్లపై వాహనం నడుపుతూ  న్యూసెన్స్ చేసే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.దగ్గర్లో ఏదేని ప్రమాదం  జరిగిన వెంటనే డయల్ 100 కి కాల్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ఎస్సై రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

Exit mobile version