Site icon Newsminute24

తొలి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేరికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు.
అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్ విరాట్​ కోహ్లీ(79) ఒంటరి పోరాటంతో ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. మిగతా ఆటగాళ్లలో పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 77 ఓవర్లలో 223 పరుగులు చేసింది భారత్.దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసొ రబాడ నాలుగు, మార్కో జాన్సన్ మూడు వికెట్లు పడగొట్టారు. ఒలివర్, ఎంగిడి, మహారాజ్ తలో వికెట్ తీశారు.

Exit mobile version