Newsminute24

తెలంగాణపై మరోసారి పంజావిసురుతున్న కరోనా!

తెలంగాణపై కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత వారం రోజులుగాక కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 608 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 8 లక్షల 5 వేల 137 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు మహ్మమారి నుంచి 459 మంది కోలుకోగా.. ఆసంఖ్య 7 లక్షల 95 వేల 880 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల 146 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు చూసినట్లయితే.. అత్యధికంగా హైదరాబాద్ లో 329.. అత్యల్పంగా వరంగల్ రూరల్ ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి.వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Exit mobile version