Newsminute24

దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి అభిమానులు ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!

మునుగోడు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. గతంలో పాకిస్తాన్ అనుకూలంగా దయాకర్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు దయాకర్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ కూ బానిసిలా వ్యవహరిస్తూ .. కోమటిరెడ్డిపై చేసిన అనూచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలా చేసే బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు.

ఇక ముునుగోడు సభలో మాట్లాడిన దయాకర్.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి ఎటువైపు ఉంటారో తేల్చకోవాలని.. కాంగ్రెస్ లో ఉంటే ఉండూ.. లేకుంటే దెం… అంటూ చెప్పరాని పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ పార్టీ వేలకోట్లు ఆస్తులు ఇచ్చిందని ఎటువైపు ఉండాలో తేల్చుకోమ్మని దయాకర్ అల్టిమేటం జారిచేయడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు ఆగ్రహాంతో ఊగిపోయారు. సొంత నియోజకవర్గంలో గెలవలేని అసమర్ధుడు మా నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదంటూ రెచ్చిపోయారు. దమ్ముంటే కోమటిరెడ్డి బ్రదర్స్ తో చర్చకురావాలని పిలుపునిచ్చారు.

కాగా మునుగోడు సభలో కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడంపై కోమటిరెడ్డి అభిమానులు మండిపడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వెంకట్ రెడ్డిపై కామెంట్స్ చేస్తుంటే ప్రేక్షకుల మాదిరి తిలకించిన నేతలు అంతర్మథనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కోసం కోమటిరెడ్డి సోదరులు ఎంతో చేశారని..అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దయాకర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అద్దంకి దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటీకే కార్యకర్తలు దయాకర్ కామెంట్స్ పై రగిలిపోతున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version