తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 15-3-2023.
అంశం, ప్రాసాక్షరి గీతం
నననన,వవవవ,మిమిమిమి.
శీర్షిక కీర్తి నిలుపు తెలుగు.
మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం
జనపద జీవన లయల హర్షాతిరేకం
పనస తొనల పలుకుల మధురగీతం
ఘనతను సాధించేనేడు గానలహరి సంగీతం
కవనమ్మున నాటుపదం పల్లవించినది
నవరాగ సమ్మేళనం నాట్యమాడినది
అవని లోని అణువణువు పులకరించినది
జవసత్వముల తోడజగతికీర్తిపొందినది.
సమిష్టి కృషి ఫలితమే ఈ ఆస్కారం
తమిదీరని చలనచిత్ర మమకారం
స్వామి దయతో వెండితెర వైభవవెలుగులు పంచాలి
అమితానంద భాషతెలుగేయనిచాటాలి.
===========
రచన: నల్లాన్ చక్రవర్తుల రోజా దేవి
సూర్యాపేట (స్వీయరచన )