పుష్య అమవాస్యనే పౌష అమవాస్య అని కూడా అంటారు. హైందవంలో పౌష అమవాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈమాసంలో పితృదేవతలకు దానం చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈరోజున ఉపవాసం ఉండటం వలన పితృదోషం, కాలసర్ప దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతారు. ఈరోజున సూర్యడిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి.
జ్యోతిష్య ప్రకారం ఇలా చేయాలి..
పౌష అమవాస్య రోజున వేకువ జామునే స్నానం చేసి మందార పుష్పాలతో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం పూర్వీకులకు శ్రద్ధ కర్మలు చేసి దానం చేయడం శ్రేయస్కరం. ఈరోజున చేపలకు తిండి పెట్టడం శుభప్రదం.
చేయకూడని పనులు..
- పెద్దలను అగౌరవపరచకూడదు.
- అబద్ధం ఎట్టిపరిస్థితుల్లోను చెప్పకూడదు.
- రాత్రి పూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదని శాస్త్రం చెబుతుంది.
చేయాల్సిన పనులు..
- శ్రీకృష్ట పరమాత్మను పూజించాలి.
- గీతాపఠనం చేయాలి.
- పూర్వికులను స్మరించుకోవాలి.
- పేదలకు బట్టలు.. ఆహారం దానం చేయాలి.
- రావిచెట్టుకు నీరు పోయాలి.
- వీలైతే రావి మొక్కను నాటడం శ్రేయస్కరం.