Site icon Newsminute24

ప్రతిఘటన సాంగ్ !

 

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో

రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో

మరో మహాభారతం ఆరవ వేదం

మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం

పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే ముద్దు మురిపాలకేడ్చి
తనువంతా దొచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిల కామ మేచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల సన్యంతో
మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకొసం

కన్న మహాపాపానికి ఆడది తల్లిగమారి
మీ కండలు పెంచినదీగుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి
పెంచుకున్న తల్లి ఒక ఆడదనే మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడొ మీరుంచిన లేత పెదవి ముద్ర
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగళ్యం
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం

శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే
మానవ రూపంలొనే దానవులై పెరిగితే
సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే
కన్నులుండి చూడలేని దృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుటుంటే
ఏమైపొతుంది సభ్య సమాజం
ఏమైపొతుంది మానవ ధర్మం

ఏమైపొతుంది ఈ భారత దేశం మన భారత దేశం మన భారత దేశం

Exit mobile version