Site icon Newsminute24

69 వ నేషనల్ అవార్డ్స్.. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమచార్యులు.. ఎవరాయన?

69 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి సారిగా టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ పుష్ప: సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ఉప్పెన ‘ ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ‘ఆర్ఆర్ఆర్ ‘ ఆరు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అయితే 2021 సంవత్సరానికి గాను బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డ్ గెలుచుకున్న పురుషోత్తమాచార్యులు ఎవరన్నది ఇండస్ట్రీ హట్ ఆఫ్ ది టాపిక్ అయింది.

కాగా  పురుషోత్తమాచార్యులు గత రెండేళ్లుగా మిసిమి మాస పత్రికలో  సినిమా పాటలు శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా. 2021 సంవత్సరంలో ఆయన రాసిన వ్యాసాలను మెచ్చిన ప్రభుత్వం ఆయన బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డుకు ఎంపిక చేసింది.అటు నెటిజన్స్ సైతం పురుషోత్తమాచార్యులు ఎవరన్న దానిపై గూగుల్ తెగ వెతుకుతున్నారు. దీంతో ఆయన ఫేమస్ అయిపోవడం ఖాయమని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

 

Exit mobile version