Newsminute24

కొత్త రకం మొబైల్ ఫోన్ పేమెంట్ మోసం !

పార్థ సారథి పొట్లూరి:

ఇప్పటివరకు మనకి మీ ఆధార్ నంబర్ బాంక్ అకౌంటు కి లింకు చేయండి లేదా మీ అకౌంటు మూతపడుతుంది అంటూ ఫ్రాడ్ కాల్స్ లేదా ఫ్రాడ్ మెసేజెస్ వచ్చి మీ అకౌంటు లో డబ్బు మాయం అయ్యేది !

బాంకులు నేరుగా వినియోగ దారుల ఫోన్ నంబర్స్ కి మెసేజెస్ పంపుతూ బాంకు ఎలాంటి ఆధార్ నంబర్ కానీ pan నంబర్ కానీ ఆడగదు ఒకవేళ ఎవరన్నా ఇలా అడిగితే దయచేసి స్పందించవద్దు అని. దాంతో చాలా మంది వినియోగదారులకి అవగాహవన వచ్చింది కానీ అక్కడక్కడా చెదురుముదురుగా ఇప్పటికీ KVC బాధితులు ఉంటూనే ఉన్నారు. 

ఇప్పుడు కొత్తగా మరో కొత్త రకం మోసానికి తెర లేపారు మోసగాళ్ళు ! 

మీ గూగుల్ pay కి కానీ, Phone pe కి కానీ ఒక వంద రూపాయలు పంపిస్తాడు మోసగాడు. వెంటనే మీకు ఫోన్ చేసే పొరపాటున వేరే వాళ్ళకి పంపాల్సిన డబ్బు ని మీకు పంపించాను కాబట్టి నా వంద రూపాయలు తిరిగి నాకు పంపించండి అంటూ అభ్యర్ధిస్తాడు దాంతో వంద రూపాయలే కదా అని మీరు తిరిగి పంపించేస్తారు . అంతే ! మీ మొబైల్ పేమెంట్ అప్లికేషన్ నుండి మీ ఖాతాలో ఉన్న డబ్బు మోసాగాడి అకౌంటు లోకి వెళ్ళిపోతుంది !

కాబట్టి ఇలా ఎవరన్నా మీ అకౌంటు లోకి 50/- కానీ 100/- కానీ పంపించి తిరిగి ఇవ్వమని కోరితే మౌనంగా ఉండండి ! అంతే కానీ 50 రూపాయలే కదా అని తిరిగి పంపించకండి !

ఢిల్లీ కి చెందిన సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ గారు ఇలా హెచ్చరిస్తున్నారు : గత మూడు నెలల కాలంలో ముంబై నగరంలో ఇప్పటి వరకు కోటి రూపాయలు మోసపోయారు మొబైల్ వినియోగ దారులు ! మోసగాళ్ళు కొత్తరకం మాల్ వేర్,ఫిషింగ్ వేర్ [Malware,Fishingware ] లని వాడుతూ మొబైల్ పేమెంట్ gateway ని బై పాస్ చేస్తూ మీ డబ్బుని కొల్లగొడుతున్నారు. 

పవన్ దుగ్గల్ Cyberlaws.net కి అధ్యక్షుడు మరియు సుప్రీం కోర్ట్ లో అడ్వొకేట్ గా పనిచేస్తున్నారు ! మొబైల్ పేమెంట్ App లలో ఎలాంటి లోపాలు లేవు అవి సురక్షితం ! అలాగే మీ మొబైల్ ఫోన్ లో యాంటీ వైరస్ , యాంటీ మాల్ వేర్ ఉన్నా అవి ఇలాంటి మోసాలని పసిగట్టలేవు. మోసగాళ్ళు కావాలనే మీ నంబర్కి చాలా కొద్ది మొత్తం అంటే 50 కానీ 100 రూపాయాలని కానీ పంపిస్తారు తరువాత మీకు ఫోన్ చేసి తన డబ్బుని తిరిగి పంపించమని అడుగుతారు కానీ ఇలాంటి సందర్భాలలో మీరు చేయాల్సింది ఏమిటంటే మీకు డబ్బు పంపించిన అతనిని లేదా ఆమె ని [ఆడ వాళ్ళు కూడా ఇలాంటి మోసాలలో ఉన్నారు ] మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వస్తే అక్కడ మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెప్పండి దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రారు మీరు సురక్షితం ! ఇది కేవలం మీకు తెలియని వాళ్ళు డబ్బు పంపించిన సందర్భానికి మాత్రమే వర్తిస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి !

మరో ముఖ్య విషయం ఏమిటంటే చాలా మంది ఎవరికన్నా డబ్బు పంపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు ఇది ప్రమాదకరం అని పవన్ దుగ్గల్ హెచ్చరిస్తున్నారు ! మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తికి స్క్రీన్ షాట్ పంపిస్తే ఫరవాలేదు కానీ అపరిచితులకి ఇలా స్క్రీన్ షాట్ పంపడం ప్రమాదకరం !

జైహింద్ ! జై భారత్ !ఇప్పటివరకు మనకి మీ ఆధార్ నంబర్ బాంక్ అకౌంటు కి లింకు చేయండి లేదా మీ అకౌంటు మూతపడుతుంది అంటూ ఫ్రాడ్ కాల్స్ లేదా ఫ్రాడ్ మెసేజెస్ వచ్చి మీ అకౌంటు లో డబ్బు మాయం అయ్యేది !

జైహింద్ ! జై భారత్ !

Exit mobile version