Newsminute24

Viral: చెత్తకుప్పలో నవజాత శిశువు.. సభ్య సమాజం తలదించుకునే ఘటన..!

Viralnews2024: సమాజంలో మానవతా విలువలు రోజు రోజుకి  నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధానికి అర్థం లేకుండా పోతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా అవనగడ్డ లో అప్పుడే పుట్టిన పాపను గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక చర్చ వెనక  చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు.అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.లోకం పోకడ తెలియని ఆ పసికందుపై అమానవీయంగా ప్రవర్తించారు.

ఇదిలా ఉంచితే..  ప్రస్తుతం పిల్లలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు కంటికి కడివెడు రోదిస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఒక బిడ్డ పుడితే చాలు అని తపస్సు చేస్తున్న దంపతులు ఎంతో మంది జంటలు ఉన్న నేటి రోజుల్లో, పుట్టిన బిడ్డలు వద్దని పారేసి వెళుతున్న ఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తున్నాయి.కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తల్లిదండ్రులే ఈ విధమైన ఘటనలకు పాల్పడుతుండటంతో ఈ ఘటనలు రక్త సంబంధాలను సైతం ప్రశ్నిస్తున్నాయి.

 

Exit mobile version