Newsminute24

లిక్క‌ర్ స్కాంతో ఆప్‌ స‌ర్కార్ బ‌ద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్‌ స్కాం ఆప్ స‌ర్కార్ ను అప్ర‌తిష్ట‌పాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్ర‌తిప‌క్ష నేత‌లు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గ‌ద్దే దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు ఆప్ నేత‌ల‌ను మ‌రింత ఇరకాటంలో ప‌డేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్ట‌ర్లు అంటించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో సహా ఆరుగురిని అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఆప్ కార్యాలయానికి వ్యాన్‌లో డెలివరీ చేస్తున్న 2,000 పోస్టర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘ‌ట‌న‌పై ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా ఆప్ నేత‌ల‌ను ఎద్దేవ చేస్తూ .. తాము నిరసనలు చేశామని చెప్పుకునే ధైర్యం కూడా ఆప్ నేత‌ల‌కు లేదని.. పోస్టర్లు వేసే సమయంలో వారు చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.

ఇక తాజాగా ఢిల్లీలో వెల‌సిన పోస్ట‌ర్ల సారాంశాన్ని ప‌రిశీలిస్తే.. మిస్టర్ కేజ్రీవాల్‌ “నిజాయితీ లేని, అవినీతి నియంతష‌.. వెంట‌నే “అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించండి, ఢిల్లీని రక్షించండి” అనే నినాదాంతో పోస్ట‌ర్లు రూపొందించారు. ఈ పోస్టర్లను బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా అంటించిన‌ట్లు తెలిసింది.మొత్తంమీద లిక్క‌ర్ స్కాం కేసు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత బీజేపీ-ఆప్‌ల మధ్య స‌రికొత్త రాజ‌కీయ వార్ కు తెర‌లేపింది.

 

Exit mobile version