Newsminute24

literature: బైబిల్ బండారం.. పుస్తకంపై నిషేధం ఎందుకంటే..?

విశి: ఇప్పుడంతా భయం భయం అయిపోయింది. ఏది రాసినా ముందుగా ఓ ముద్ర పడిపోతుంది. కానీ, డెబ్బై ఏళ్ల క్రితం తాము అనుకున్నది అనుకున్నట్లు ధైర్యంగా రాసి జనం ముందుకు తెచ్చిన వారు‌ ఉన్నారు. అలాంటి వ్యక్తి నాసిన వీరబ్రహ్మం(ఎన్.వి.బ్రహ్మం). ఆయనది ప్రకాశం జిల్లా పరుచూరు తాలూకా గొనసపూడి.

క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్రా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. 1958 మార్చి 23న హైకోర్టు కూడా ఆ నిషేధాన్ని ఆమోదించింది. ఆ తర్వాత సుప్రీం కోర్ట్‌కి వెళ్లగా 1962లో నిషేధం తొలగించింది. బైబిల్‌ని విమర్శించారు అనగానే ఎన్.వి.బ్రహ్మం గారు ఆరెస్సెస్/భాజపాకు చెందిన వ్యక్తి అనుకోవద్దు. ఆయన హేతువాది. చాలా కాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. త్రిపురనేని రామస్వామి, ఎం.ఎన్.రాయ్‌ల భావాల వ్యాప్తికి కృషి చేశారు. Radical Humanist పత్రికలో అనేక రచనలు చేశారు. ఆయన 2015 జూలై 28 న మరణించారు.

Exit mobile version