Site icon Newsminute24

cinima: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు…!

Cinima:

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించడం గర్వకారణంగా, ఆనందదాయకంగా ఉంది.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం హర్షదాయకం. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు,సాహు గారపాటి, శ్హరీష్ పెద్దిలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్‌ విభాగంలో హను-మాన్ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్. నిపుణులు మరియు నిర్మాతకు అభినందనలు.

ఇతర విభాగాల్లో విజేతలైన వారికి కూడా శుభాభినందనలు:

ఈ పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమలో నూతన స్ఫూర్తిని, నూతన ఉత్సాహాన్ని నింపుతాయని విశ్వాసం.

జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా ఎంపికైన షారుక్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా శ్రీమతి రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో ,ఇతర విజేతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.

Exit mobile version