Women bangles sentiment:
ఈసంగతి మీకు తెలుసా..! ఒక్క మగ బిడ్డ ఉన్న తల్లి..ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలట , ఇద్దరు బాబులు ఉన్న తల్లి..
ఐదుగురు బిడ్డల తల్లితో గాజులువేసుకోవాలట.. అది కూడా సంక్రాంతి ముందేనట..లేదంటే ఏదో జరిగిపోతుందంటా..ఇదే సెంటిమెంట్ ప్రచారం ఆ నోటా..ఈ నోటా ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. తెలంగాణలో ఎక్కడా చూసినా ఇదే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ ఇద్దరు ఆడవాళ్లు కలుసుకున్నా..ఇదే ముచ్చట పెడుతున్నారట.
మొత్తానికి సెంటిమెంట్ ప్రచారం ఎవరు మొదలు పెట్టారోగానీ.. ఒకరు, ఇద్దరు మగ బిడ్డలు ఉన్న తల్లులంతా తరలి వస్తుండటంతో గాజుల షాపులు గలగల..కళకళలాడుతున్నాయి. అసలే మహిళలకు గాజుల సెంటిమెంట్ ఎక్కువ. సాంప్రదాయ దుస్తులలో బ్యాంగిల్స్ కూడా అంతర్భాగం. మహిళలు చేతులకి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదనే ప్రచారం కూడా ఉంది. మట్టి గాజులు, బంగారు గాజులు వేసుకుంటే లక్ష్మీ దేవీ కటాక్షిస్తుందని, ఎరుపు గాజులు సుమంగళితత్వానికి ప్రతీక అని, ఆకు పచ్చని గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగంలో రాణిస్తారని, పసుపు పచ్చని గాజులు వేసుకుంటే సొసైటీలో మంచి పేరు వస్తుందని, నలుపు, నీలం రంగుల గాజులతో సమస్యలు ఎదురవుతాయని..ఇలా రకరకాల సెంటిమెంట్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.