ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని దేశ ప్రజలు ఓడిస్తారని.. బీజేపీని ప్రజలు మర్చిపోతారని రాహుల్ భ్రమపడుతున్నారని అన్నారు పికే. బీజేపీ ప్రభావం మరో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన స్పష్టం వేశారు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా దేశ రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావితం చేస్తుందని పీకే తెలిపారు. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ కేంద్రంగానే దేశ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యానంతరం నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎలాంటి స్థానంలో ఉందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుంది. ప్రధానమంత్రి మోడీని ప్రజలు విసిరికొడతారని కొందరు అంటున్నారు. 30 శాతం ఓటు బ్యాంక్ సాధించిన ఏ పార్టీ అయినా ప్రజల నుంచి అంత తొందరగా పోదని స్పష్టం చేశారు.
దేశంలో బీజేపీ ప్రభావం మరో 30ఏళ్లు ఉంటుంది: ప్రశాంత్ కిషోర్
