Gunturkaaramreview: ‘ అతడు ‘ ‘ ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ గుంటూరు కారం ‘ మూవీపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ,మీనాక్షి చౌదరి కథానాయికలు( హీరోయిన్స్)గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!
కథ:
బాల్యంలో (చిన్నతనంలో) ఓ సంఘటన( రాజకీయాల పరంగా) కారణంగా రమణ (మహేశ్ బాబు) తల్లి వసుంధర అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అనూహ్య నాటకీయ పరిణామాల నేపథ్యంలో పాతికేళ్ల తర్వత రమణకు తల్లి నుంచి కబురు (పిలుపోస్తుంది) వస్తుంది. అసలు వసుంధర తన కొడుకును ఎందుకు వదిలి వెళ్ళిపోతుంది? తల్లి , కోడుకు మధ్య దూరానికి గల కారణాలు ఏంటి? మధ్యలో అముక్త మాల్యద( శ్రీలీల) తో రమణ ప్రేమ కహానీ ఎలా సాగింది? చివరికి రమణ తల్లి దగ్గరకు చేరాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..?
సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ కొంతలో కొంత ( ఒకే) బెటర్ అని చెప్పవచ్చు. మహేష్ – శ్రీలీల మధ్య ప్రేమ సన్నివేశాలు, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మహేష్ కామెడీ పండిచే విధానం ఖలేజా సినిమా గుర్తుకు తెప్పిస్తుంది. సెకండ్ ఆఫ్ యావరేజ్ ( ఓ మోస్తారు). చాలా రోజుల తర్వాత డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ పరంగా మహేష్ సరికొత్తగా కనిపిస్తాడు. ‘ కుర్చీ మడత పెట్టి సాంగ్ సినిమాకే హైలెట్.
ఎవరెలా చేశారంటే?
సినిమా పరంగా మహేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రీ _ రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పినట్టు ‘ మూవీ కోసం మహేష్ 100 కు 200 పర్సెంట్ కష్టపడ్డాడు. శ్రీలీల పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది. స్వతహాగా డాన్సర్ అయిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ ఇరగదీసింది. మరో కథానాయిక మీనాక్షి చౌదరి ఉన్నంతలో బాగానే నటించింది.పవర్ పుల్ పాత్రలో నటించిన రమ్యకృష్ణ ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక పరంగా:
కథ పరంగా చూసుకుంటే ‘గుంటూరు కారం’ మూవీ మహేష్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆయన మార్క్ సినిమా కాదని కచ్చితంగా చెప్పగలం. సంగీతం పరంగా తమన్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా ఒక్క మాటలో.. సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ పరంగా చెప్పాలంటే ..
‘కిటికీలోంచి చూసే నాన్న
తలుపులు వేసేసే అమ్మ
వీధిలో తిరిగే కొడుకు
ఉస్సూరు మనే ఫ్యాన్స్”..
రివ్యూ రేటింగ్: 2/5( సినిమా సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)