Newsminute24

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తుంటే…. టీఆర్ఎస్‌, బీజేపీలు దొందు దొందేనంటూ…కాంగ్రెస్‌ చెబుతోంది. మొత్తానికి… మూడూ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో… తెలంగాణ రాజకీయాలు వేడెక్కెతున్నాయి.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దళితులను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌గా చూసిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సైతం దళితులకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.
అటు రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌లపై ఫైరయ్యారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్‌ జీవన్‌ రెడ్డి. సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో 150 ఎకరాల్లో వరి అనేది పూర్తి అవాస్తమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ముఖ్యమంత్రి వ్యక్తిగత అంశాలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు.
కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీలు ముందు నుంచి కలిసే ఉన్నాయన్నారు ఆరోపిస్తోంది కాంగ్రెస్‌. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారాయన. సింగరేణి కాలరీస్‌కు ఆనుకొని ఉన్న మైనింగ్‌ ప్రైవేట్‌ పార్టీకి ఆప్షన్‌ ఇచ్చారన్నారు. వరి కొనుగోళ్లలో రెండు పార్టీలు రైతుల్ని మోసం చేస్తున్నాయన్నారు.

Exit mobile version