చాడశాస్త్రి:
హైదరాబాద్ నుండి వైజాగ్ కి వందే భారత్ ట్రైన్ పెట్టారో లేదో… టిక్కెట్ చార్జీలు మీద ఒకటే గొడవ.
అన్ని ఫ్రీగా కావాలి… లేదా కనీసం అతి చవగ్గా కావాలి…
పోనీ ఉన్న వాటితో సర్దుకుపోతామా అంటే విదేశాల ఫొటోలు పెడుతూ, వాటితో పోలుస్తూ అక్కడ సదుపాయాలు బ్రహ్మాండం, ఇక్కడ పరమ దరిద్రం అంటూ విమర్శలు.
సరే! విమర్శించ వచ్చు. విమర్శలే రాజకీయ పాలకులను అదుపులో ఉంచుతాయి. కానీ ఏదీ విశ్లేషించకుండా అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తూ ఉంటే నిజాయితీగా పాలించే నాయకులను కూడా మనం కోల్పోతాం.
ఎందుకు ఈ సోది అంటే… చెప్తాను వినండి.
* విశాఖ హైదరాబాద్ మధ్య సాధారణ రోజుల్లో అంటే పండుగలు, శుక్ర, శని, ఆదివారాలు కాని రోజుల్లో RTC నాన్ ఏసీ సిటింగ్ బస్ ఛార్జ్
టాక్స్ తో కలిపి: ₹1050
*విశాఖ హైదరాబాద్ మధ్య సాధారణ రోజుల్లో అంటే పండుగలు, శుక్ర, శని, ఆదివారాలు కాని రోజుల్లో RTC సాధారణ ఏసీ సిటింగ్ బస్ ఛార్జ్ టాక్స్ తో కలిపి: ₹1450, వోల్వో ₹1600
*విశాఖ హైదరాబాద్ మధ్య సాధారణ రోజుల్లో అంటే పండుగలు, శుక్ర, శని, ఆదివారాలు కాని రోజుల్లో RTC ఏసీ స్లీపర్ బస్ ఛార్జ్ టాక్స్ తో కలిపి: ₹1500౼₹1900
APSRTC, TSRTC కలిపి సిటింగ్, స్లీపర్ కలిపి కూడా సాధారణ రోజుల్లో రోజుకు గరిష్టంగా 10 బస్సులు కూడా నడపడం లేదు. అంటే గరిష్టంగా 300 నుండి 400 మంది ప్రయాణీకులను ప్రభుత్వ బస్సులు ఈ రేట్లతో తీసుకు వెళ్లగలవు. మిగతా బస్సు ప్రయాణీకులకు అధిక ధరల ప్రైవేట్ బస్సులే గతి.
సరే ఇప్పుడు రైల్ చార్జీలు చూద్దాం.
ఏ రిజర్వేషన్ అవసరం లేదు. బస్సులాగే కూర్చొని ఏదో లాగా చవగ్గా వెళ్లి పోదాం అనుకునే ప్రయాణీకులకు గోదావరి వంటి ఎస్ప్రెస్ ట్రైన్ లో కూడా హైదరాబాద్ విశాఖ మధ్య టికెట్ ధర ఎంతో తెలుసా? ₹22౦. అవును, అక్షరాలా ₹220.
పోనీ రిజర్వేషన్ చేయించుకుని సిటింగ్ తీసుకుంటే ₹230
పోనీ ఎసి లేకుండా పడుకుని వెళ్ళడానికి సాధారణ స్లీపర్ అయితే ₹425
గరీబ్ రథ్ ₹800..మిగతా గోదావరి వంటి వాటిల్లో థర్డ్ ఏసీ ధర ₹1100
ఒక రోజులో ఒక్క గోదావరి ₹425 టికెట్ తో 750 మంది ప్రయాణీకులను స్లీపర్ క్లాస్ లో, గరీబ్ రథ్ 1400 మంది ప్రయాణీకులను జస్ట్ ₹800 రూ. టికెట్ తో AC స్లీపర్ లో తీసుకు వెళ్తోంది. మిగతా ట్రైన్స్ అన్ని లెక్క వేస్తే ఒక్క రోజులో సీట్లు బెర్త్ లు అన్ని లెక్క వేస్తే సుమారు 7000 మంది ప్రయాణీకులను రైల్వే తీసుకు వెళ్తోంది.
ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. డీజిల్ ధరలు, విద్యుత్ ధరలు పెరిగిపోతున్నాయి అని మనం గోల చేస్తున్నట్లే రైల్వే వాళ్ళు కూడా చెయ్యాలిగా? మరి RTC పెంచి నట్లు అంత మేరా ధరలు పెరగాలి కదా? మరి ఎన్నాళ్ళు అయింది రైల్ టికెట్ ధరలు పెరిగి?
సాధారణ ప్రయాణీకుల చార్జీలు పెంచకూడదు.
పోనీ కొన్ని టిక్కెట్లు తత్కాల్ , ప్రీమియం తత్కాల్ అని పెట్టి ఎక్కువ చార్జీలు వసూలు చేద్దాం అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా రైల్వే వారు ప్రయాణీకులను దోచేస్తున్నారు అని మీడియా వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చి పోతాం.
పోనీ ఇక్కడ వస్తున్న నష్టాలు, వందే భారత్ వంటి ప్రీమియం ట్రైన్స్ పెట్టి, ధరలు భరించే స్తోమత ఉన్న వాళ్ళ దగ్గర ధరలు వసూలు చేసుకుంటాం అని రైల్వే వాళ్ళు అనుకుంటే అదీ కూడా రైల్వే తప్పే.
పోనీ మన ప్రయాణీకులం బాధ్యతగా సరిగ్గా ఉంటామా అంటే రైళ్లలో సీట్లు కోస్తాం, దుప్పట్లు , నేప్కిన్స్ ఎత్తుకు పోతాం, చెత్త అంతా పోస్తాం, టాయిలెట్స్ లో ఉంచే మగ్, అద్దం, టాప్ లు పాడు చేసేస్తాం, కమోడ్స్ లో చెత్త , డైపర్లు తోసేస్తాం. రైల్వేకు ఖర్చు పెంచే అన్ని పనులు చేస్తాం. పైగా
సరిగ్గా మైంటైన్ చేయడం లేదు అని రైల్వే ని తిట్టుకుంటాం.
ఈ విధమైన నెగిటివ్ ఆలోచనలు మన బుర్రలోకి ఎక్కడానికి మీడియా కారణం. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా, నెగటివ్ మసాలా వార్తలు ప్రజలు ఇష్ట పడతారు కాబట్టి మీడియా వాటికే ప్రాధాన్యత ఇస్తోంది. మనం కూడా స్వంతంగా ఆలోచించి విశ్లేషణ చేయడం మానేసి మీడియా వాడు ఎలా మన బుర్రలోకి ఎక్కిస్తే మనం కూడా గుడ్డిగా అలాగే ఆలోచిస్తున్నాం.
అందుకే ఎటువంటి ప్రజలకు అటువంటి పాలకులే దొరుకుతారు అంటారు.