Site icon Newsminute24

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకని? ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలు జగన్ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవ చేశారు.ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని పవన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

కాగా చంద్రబాబు సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు పవన్ కల్యాణ్. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయన్నారు. జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని పవన్ స్పష్టం చేశారు.

Exit mobile version