Site icon Newsminute24

దేశ ప్రతిష్టతను మసకబార్చే కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

భారత్ ప్రతిష్టతను మసక అంతర్జాతీయ కుట్ర జరుగుతొందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. నాగపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రఖ్యాత సెలబ్రెటీలు ట్వీట్స్ వెనక అంతర్జాతీయ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. దేశంలో గందరగోళం వాతావరణం సృష్టించి అల్లర్ల రేపే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

కాగా రైతులకు మద్దతు తెలుపుతూ హాలీవుడ్ పాప్ సింగర్ రిహనా, ప్రపంచ పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హరిస్ సిస్టర్ మీనా హరిస్ ట్వీట్జ్ చేయడం.. కేంద్ర మంత్రుల బృందం వారి ట్వీట్స్ కి ధీటుగా బదులివ్వడం తెల్సిందే. మరోవైపు దేశంలోని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమం వేదికగా గళం విప్పారు. మా దేశ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం ఎంటని, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించొద్దని హెచ్చరించారు.

Exit mobile version