Nancharaiah merugumala senior journalist:
పాటల రచయిత అనంత శ్రీరామ్ ‘హైందవ శంఖారావం’ ప్రసంగం విన్నాక పశ్చిమ గోదావరి సినీ కాపులే సనాతన హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది!
తెలుగు సినిమాల్లో హిందూ ధర్మం మీద దాడి జరుగుతోందని ‘హైందవ శంఖారావం’ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించడం లేదు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్ (వీఎచ్‌పీ) ఈ సభ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాల్లో పనిచేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాపునాడు నాయకుడు, పాత తరం సినీ నిర్మాత చేగొండి హరిరామ జోగయ్య గారి దగ్గరు బంధువు, చేగొండి కుటుంబంలో పుట్టిన అనంత శ్రీరామ్ ఇలా వీర హిందువుగా కొత్తగా అవతరమెత్తడం శానా బాగుంది చాలా మందికి. పశ్చిమ గోదావరి జిల్లాలో చేగొండి వారి ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ గారు కూడా కొద్ది నెలల క్రితం సనాతన హిందూ ధర్మ రక్షణకు నడుం బిగించి, పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కాపు సినీ–రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్, అనంత శ్రీరామ్ పోకడలు పరిశీలిస్తే గోదావరి అదే పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపులే తెలుగునాట సనాతన హిందూ ధర్మాన్ని కాపాడతారేమో అనే అనుమానం వస్తోంది.