APPOLITICS: మచిలీపట్నం జనసేన 10 వ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ తో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ నేతలకు.. ఈసభ విజయవంతమవడంతో వైసీపీలో అంతర్మధనం మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకూల మీడియా, సోషల్ మీడియాలో సినిమా ఆడియో ఫంక్షన్ లా ఉందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న.. లోలోపల మాత్రం ఫ్యాన్ నేతలు ఆందోళనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేతలు.. రానున్న ఎన్నికల్లో జనసేన పాత్రను.. విధివిధానాలను తేటతెల్లచేయడంతో డైలామాలో పడ్డట్లు తెలుస్తోంది.
ఇక జనసేన ఆవిర్భావ సభ సక్సెస్ తో జోష్ లో ఉన్న జనసేనికులు సోషల్ మీడియాను హోరిత్తిస్తున్నారు. ఈనేపథ్యంలోనే బందరులో జనసముద్రం- వైసీపీ శ్రేణుల్లో కలవరం క్యాప్షన్ తో జనసేన రూపొందించిన కార్టూన్ కు విశేష స్పందన లభిస్తోంది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేనికులు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఏపీ భవిష్యత్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు.