Newsminute24

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై జ‌న‌సేన సెటైరిక‌ల్ కార్టూన్‌..

APMLCELECTIONS: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ న‌డుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజ‌క‌వ‌ర్గంలో చూసిన ఎన్నికల్లో అధికార పార్టీ ప్ర‌లోభాల‌కు పాల్ప‌డుతోంది. వైసీపీ నేత‌లు డ‌బ్బులు పంచుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈనేప‌థ్యంలోనే జ‌న‌సేన పార్టీ రూపొందించిన కార్టూన్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. కార్టూన్ పై నెటిజ‌న్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు తోడు 6,7 త‌ర‌గతుల చ‌దివిన మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి వైసీపీ నేతలు ఓట్లేయిస్తున్నారు. ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రముఖ చాన‌ల్ రిపొర్ట‌ర్ ఓటేసేందుకు క్యూ లైన్లో నిలుచున్న మహిళ‌ల‌ను మీరెంత వ‌ర‌కు చ‌దువుకున్నారు అడగ్గా.. మేము 6 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నామండి స‌ద‌రు మ‌హిళ స‌మాధానం ఇవ్వ‌డంతో షాక్ అవ్వ‌డం రిపొర్ట‌ర్ వంతైంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ ఇలాంటి అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందంటూ ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version