Newsminute24

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి మహనీయులను అనుసరించడమే.. వారికి ఇచ్చే ఘనమైన నివాళిని పేర్కొన్నారు.’ నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రం ఇస్తాను అని చెప్పిన నేతాజీ జయంతిరోజున ప్రారంభమైన జనగణమణ నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల లో కూడా అమలు చేయాలని.. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అందించాలని జేడి విజ్ఞప్తి చేశారు.

జేడి ఆగ్రహాం

ఇక కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీలు దేశభక్తి గురించి ఉపన్యాసిస్తుండగా.. కొందరు విద్యార్థులు వెకిలి కామెంట్లు చేయడంపై జేడి ఫైర్ అయ్యారు. దేశం గురించి మాట్లాడుతుంటే.. సిగ్గు, శరం లేకుండా చిల్లర కామెంట్స్ ఏంటంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

Exit mobile version