Site icon Newsminute24

ఫూలే మహా శక్తివంతుడు :ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: మహాత్మా జ్యోతిబా ఫూలే గారు గొప్ప శక్తివంతుడని, సంఘ సంస్కర్త అని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఫూలే సేవలను కొనియాడారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌ నందు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. సంస్కర్తలలో గొప్ప సంస్కర్త జ్యోతిబా ఫూలే అని.. కులాల నిర్మూలన కోసం ఆయన తపించేవారని అన్నారు. ఆయన అనేక సామాజిక సేవా సంఘాలను, అనేక పత్రికలను నడిపేవారని, ఆయన జర్నలిస్ట్‌ అని కూడా గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షులు  సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు  లామ్‌ తాంతియా కుమారి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు  నరహరశెట్టి నరసింహారావు,   తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version