Newsminute24

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…

NelloreRural: నెల్లూరు రూరల్:   ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని  కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం 3 సార్లు సంతకాలు చేయించానని..అయినా అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాటి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వేదాయపాళెం, గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం 150 అంకణాల స్థలాన్ని కూడా కేటాయిపు చేశామని, గత్యంతరం లేని పరిస్థితులలో అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా నేడు ప్రజల పక్షాన ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమైనట్లు తేల్చిచెప్పారు. కొన్ని వేల మంది క్రిస్టియన్ సోదరులకు ఎంతో మేలు చేసే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం 6 కోట్లు నిధులు ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఈ రోజు నుండి 10 రోజులపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి, జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 10వేలకు పైన విజ్ఞాపనలు పంపిస్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గం॥లకు గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు కేటాయించిన స్థలంలో నిరసన కార్యక్రమం చేపడతామని కోటంరెడ్డి హెచ్చరించారు.

 

Exit mobile version