Newsminute24

యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది: మనోహర్

యువత పోరాటంతోనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.శ్రీకాకుళం రణస్థలం యువశక్తి సభలో భాగంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.తెలంగాణతో పోలిస్తే నిరుద్యోగ రేటు ఏపీలో డబుల్ ఉందన్నారు. కావాలనే ఉత్తరాంధ్రా ప్రాంతంలో యువ నాయకత్వాన్ని తొక్కేశారని మండిపడ్డారు. వైసీపీ జెండాలు మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు కొండల్ని మింగేస్తూ… కోట్లు కొల్లగొడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారన్నారు. సోషల్ మీడియాలో  పోస్టులు షేర్ చేసినందుకు యువకులపై దాడులు చేసి, కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని మనోహర్ పేర్కొన్నారు.

ఇక ఉత్తరాంధ్రా భవిష్యత్తు కోసం… ఈ ప్రాంత యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మనోహర్. నిరాశలో కూరుకుపోయిన యువతలో భరోసా నింపడానికే యువశక్తి కార్యక్రమాన్ని పవన్ ఏర్పాటు చేశారన్నారని తెలిపారు. సంక్షేమం అంటే కేవలం బటన్ నొక్కడమే అని భావిస్తోన్న నియంత ముఖ్యమంత్రి జగన్ కి ..మనమంతా కలిసి బుద్ధి చెప్పాలన్నారు. తిత్లీ తుపాన్ సమయంలో జగన్ రెడ్డి  పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నా… ఇక్కడ బాధితులను పరామర్శించడానికి ఒక్క రోజంటే ఒక్క రోజు రాలేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా.. కనీస మౌలిక సదుపాయాలు లేకున్నా.. జన సేనాని ఈ ప్రాంతంలోనే 6 రోజుల పాటు ఉండి తిత్లీ తుపాన్ బాధితులకు అండగా నిలబడ్డారని మనోహర్ తేల్చిచెప్పారు.

 

Exit mobile version