Site icon Newsminute24

నల్గొండ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘మెగా పవర్ స్టార్’ జన్మదిన వేడుకలు!

నల్గొండ జిల్లా కేంద్రంలోని చారుమతి చైల్డ్ కేర్ లో ఆదివారం ‘ మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షుడు అలుగు బెల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అభివృద్ధి కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకొని.. మేమే సైతం మా వంతు కృషిగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం అనాధ బాలలకు ఒకరోజు సరిపడా బియ్యం, పండ్లు, స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు అలుగుబెల్లి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు sk. అహ్మద్, రామ్ చరణ్ యూత్ అధ్యక్షులు తాండూరు.సురేష్,జింజిరాల ముఖేష్ ఎసు,వెంకన్న, డేవిడ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version