Newsminute24

ఏపీ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: నాదెండ్ల

వివేకానంద జయంతి పురస్కరించుకుని జనసేన తలపెట్టిన యువ శక్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లభించిందన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.  రణ స్థలంలో సభా స్థలిని జనసైనికులతో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  యువతరం భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి తో పాటు  సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్  సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారని మనోహర్ స్పష్టం చేశారు.

కాగా యువ శక్తి కార్యక్రమంలో భాగంగా.. ఉత్తరాంధ్రలోని వెనుకబాటుతనం, వలసలు.. మత్స్యకారుల సమస్యలు..  ఇతర అంశాల మీద 100 మంది యువతీయువకులు పవన్ సమక్షంలో వారి అభిప్రాయాలను  పంచుకుంటారని మనోహర్ పేర్కొన్నారు. ఈ అవకాశం కోసం పార్టీ కేటాయించిన 20 ఫోన్ లైన్లలో రెండు రోజుల్లోనే సుమారు 6 వేల ఫోన్ కాల్స్.. 2 వేలకు పైగా ఈమెయిల్స్ వచ్చాయన్నారు. 8వ తేదీ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. సభకు  శ్రీకాకుళం పోలీసులు అనుమతి కూడ లభించిందన్నారు. జనసేన ఎల్లప్పుడు చట్టాన్ని గౌరవిస్తుందని .. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని  మనోహర్ స్పష్టం చేశారు. 

 

 

 

 

 

 

 

Exit mobile version