మ్యాచ్ గెలవగానే ఆటగాళ్ల సంబరాల్లో మునిగిపోగా.. డ్రెస్సింగ్ రూం బాల్కనీ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కావిప్పి తిప్పడం అప్పట్లో సెన్సేషన్..అగ్రెసివ్ కెప్టెన్ గా పేరొందడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.
యువఆటగాళ్ళు యువరాజ్-కైఫ్ రాణించడంతో టీం ఇండియాలో మార్పులకు శ్రీకారం చుట్టారు.టీం ఎంపికలో సైతం యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం..బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం మొదలయింది..
యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో గంగూలీ ముందుండేవాడు..ఫలితంగా టీం ఇండియా ఎన్నో విజయాలు రికార్డులు నెలకొల్పేందుకు దోహదపడింది..ధోని రైనా కోహ్లీ రోహిత్ ఉతప్ప గంభీర్ లాంటి గొప్పఆటగాళ్లు వెలుగులోకి రావడం..టీం ఇండియా ప్రపంచ క్రికెట్లో శాసించే స్థాయికి చేరుకోవడం గంగూలీ ఆరంభించి పాటించినా యువమంత్రం. ధోని సైతం అసూత్రాన్ని పాటిస్తూ తన సారధ్యంలో టీం ఇండియాను చరిత్రలో లిఖించే రికార్డులును నెలకొల్పాడు.
‘నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ ‘.. నూతన శకానికి ఆరంభం!
