Newsminute24

బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట‌: జాతీయ స్థాయిలో బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంద‌న్నారు  రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి . నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నదన్నారు.ఇక్కడి గల్లీ కాంగ్రెస్ నాయకత్వం తో ఆ పార్టీ క్యాడర్ విసిగిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.అభివృద్ధి, ఎజెండా లు ఏమి లేకుండా బూత్ మాటలకే గల్లీ నాయకులు పరిమితం కావడంతో ఆ పార్టీ క్యాడర్ బి ఆర్ యస్ లోకి బారులు తిరుతున్నారన్నారు. సూర్యపేట పురపాలక సంఘంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ,ఐ యన్ టి యూ సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి,ఐ యన్ టి యూ సి యువజన విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజేందర్ రెడ్డి,అమరనాధ్ రెడ్డి,మైనారిటీ నేతలు యం ఏ రషీద్,అబ్దుల్ రహీం, యస్ కే జమాల్,బాబా తదితరులు వారి వారి అనుచరులతో శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బి ఆర్ యస్ లో చేరారు.బి ఆర్ యస్ లో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంత‌రం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి, కాంగ్రెస్ లతో తెలంగాణా కు తీరని నష్టం వాటిల్లిందని  విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని నడపడం సాధ్యం కాదు అన్నది తేలిపోయిందన్నారు.బి ఆర్ యస్ తోటే దేశానికి భవిష్యత్ ఉంటుందన్నారు.ప్రజల నూతన ఆకాంక్షలను నెరవేర్చేందుకే బి ఆర్ యస్ అవిర్బావించిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన దార్శనికుడు లేడని మంత్రి చెప్పుకొచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు జహీర్ ,మడి పల్లి విక్రమ్, బి ఆర్ యస్ నేతలు బైరు వెంకన్న,గుడిపూడి వెంకటేశ్వర రావు,సయ్యద్ సలీమ్,మీలా వంశీ,శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version