Site icon Newsminute24

7 వ తేదీన పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం: సంకినేని

సూర్యాపేట: తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణను రూపొందించిందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పార్టీ ఆదేశానుసారం.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం సంకినేని నివాసంలో నియోజక వర్గ శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఈనెల 7వ తేదీన త్రివేణి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ  పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారని.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారని సంకినేని స్పష్టం చేశారు.

 

Exit mobile version