నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ అపూర్వ రావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు. అనంతరం పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల సంఖ్య తగ్గించి..పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల సత్వర పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని.. కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలని ఎస్పీ అపూర్వ రావు పేర్కొన్నారు.