Tollywood: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ శుభవార్త. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు కోసం సూపర్ స్టార్ నటించిన పాత సినిమాల నుంచి ఒక ప్రత్యేక 4K ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ ప్రత్యేక ట్రైలర్‌ను హరి హర వీరమల్లు సినిమా షోతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కి సంబంధించిన ఎడిటింగ్ పూర్తి చేసి, థియేట్రికల్ ప్రెజెంటేషన్‌కు సిద్ధంగా ఉంచారు. 4Kలో విడుదలవుతున్న ఈ ట్రైలర్ మహేష్ బాబు అభిమానులకు ఒక పెద్ద విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.
ఇది మాత్రమే కాదు, మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా నుంచి కూడా ఒక గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే గ్లింప్స్ ద్వారా ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ టాక్.
సాధారణంగా మహేష్ బాబు బర్త్‌డే అంటేనే సోషల్ మీడియా లో ట్వీట్ల వర్షం కురుస్తుంది. ఈసారి మాత్రం థియేటర్లలోనూ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.