Site icon Newsminute24

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ ..!!

సూర్యాపేట:  సూర్యాపేట-ఖమ్మం హైవేపై ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. మోతే మండలం మామిల్లగూడెం వద్ద కారును ..  బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి  చెందగా.. ఇద్దరికి తీవ్ర  గాయాలయ్యాయి.   బైక్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిది ఖమ్మం జిల్లా అని సమాచారం. వారంతా  హైద్రాబాద్ నుంచి ఖమ్మం వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Exit mobile version