సీఎం కేసిఆర్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని ఆరోపించారు.BRS పేరుతో కేసిఆర్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఇచ్చారని..దాని అర్థం అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటని.. ఆయన కుటుంబానికి లిక్కర్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. మద్యంతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆయన విస్తరించారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇప్పటికే కేసిఆర్ కుమార్తె కవిత పై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఉన్నాయన్నారు రేవంత్. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు. తానే స్వయంగా ఆరోపిస్తున్నానని.. కేసీఆర్కు మరో సారి అధికారం ఇస్తే ఢిల్లీ లేదా తెలంగాణలో లిక్కర్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36వేల కోట్లకు పెరిగిందన్నారు.
ఇదిలా ఉంటే..తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారని.. అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోందని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని పోలీసులు చెబుతున్నారని. అసలు ఫిర్యాదు ఇచ్చిందెవతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, నోటీసులివ్వకుండా పార్టీ వార్ రూంలో ఎలా సెర్చ్ చేస్తారు?అని రేవంత్ ప్రశ్నించారు.