Site icon Newsminute24

Poetry: రెండు సమాధుల దూరంలో…!

Panyalajagannathdas: 

రెండు సమాధుల దూరంలో…

రెండు సమాధుల దూరంలో
దేవదూతల వీపులకు రెక్కలేవీ ఉండవు.
వాళ్ల అలజడి
నేలను అతలాకుతలం చేస్తుంది.
మొత్తానికి ఏదోలా
శాశ్వతంగా నిద్రిస్తున్న వారికి
సూర్యోదయం చేరువవుతుంది.

రెండు సమాధుల దూరంలో
ఎవరూ పట్టించుకోని రెక్కల కుప్పలు-
ఇప్పుడెవరికీ అవి ఏమాత్రం అక్కర్లేదు.
గగనపు గరిక భస్మాన్నిపోగుచేస్తూ,
మునివేళ్లతో నీట కలుపుతూ
ఆరిపోతున్న గొంతుల్లో నేను దగ్ధమవుతున్నాను.

రెండు సమాధుల దూరంలో
ఆశల ధిలాసాతో గుండెల మీద
చేతులేసుకున్న వాళ్లెవరూ లేరు.
ఎవరి కోసం వాళ్లే ప్రార్థనలు చేసుకుంటున్నారు.
ఒక్కొక్కరి ముందు ఒక్క సమాధి మాత్రమే ఉంది.
అక్కడే వాళ్లు మోకాళ్ల మీద మోకరిల్లి ఉన్నారు.

గగాజ్‌ మూలం: ఎలీనా మాలకాయ్‌
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Exit mobile version