సూర్యాపేట: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ “ఓటు” కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి పునాది ఓటని.. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.సూర్యాపేట జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాతీయ ఒటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ గతిని మార్చగల శక్తి” ఓటు ” కు ఉందన్నారు..ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి.. వ్యవస్థ మార్పు కు నాంది పలికేదే “ఓటు” అని గుర్తుచేశారు. ప్రజానాయకుడిని ఎన్నుకొవ్వాలంటే 18 ఏళ్లు నిండిన యువత ఓటు అనే ఆయుధాన్ని వజ్రంగా ఉపయోగించాలని మంత్రి కోరారు.
ప్రజాస్వామ్యానికి పునాది “ఓటు” : మంత్రి జగదీష్ రెడ్డి
