Suryapeta: సూర్యాపేట: బాలెం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల డిగ్రీ కళాశాలలో 2023_24 విద్యా సంవత్సరానికి మొదటి దశ ప్రవేశాలకు TGUGCET అర్హత సాధించిన విద్యార్థినిలు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలకు రావాలని ప్రిన్సిపల్ డాక్టర్ పి. శైలజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ ఒకటో తేదీన బి. ఏ.(హెచ్. ఇ. పి)బి.ఎస్సీ. ఫిజికల్ సైన్స్( ఎం.ఎస్. డి.ఎస్. , ఎంపీసీ) బీ.కాం.(కంప్యూటర్ అప్లికేషన్స్), జూన్ రెండవ తేదీన బీఎస్సీ లైఫ్ సైన్స్ ( బి.జెడ్. సి, ఎం.జె.పి. సి).. జూన్ మూడవ తేదీన బి. కాం. ( జనరల్ విద్యార్థినీలు) హాజరుకావాలని ఆదేశించారు. ఇంటర్, టెన్త్ మెమోలతో పాటు TGUGCET_ హాల్ టికెట్, కులం ,ఆదాయం, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, లేటెస్ట్ ఐదు పాస్ ఫోటోస్ తో రావాలని ప్రిన్సిపల్ ప్రకటనలో సూచించారు.
TGUGCET అర్హత సాధించిన విద్యార్థినీలు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది ఎప్పుడంటే?
