మెగాస్టార్ అభిమానులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ & నిరంజన్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానంటూ.. అలాంటివారు ప్రమాదంలో పడితే దైవమే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు.. రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయిన టీజర్ మెగాస్టార్ ఎంట్రీ తో కుమ్మేసింది. టీజర్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక టీజర్ ఆద్యంతం దర్శకుడు కొరటాల శివ మార్కు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎర్ర కండువా వేసుకొని చిరంజీవి పిడికిలి బిగించి చేతిని పైకి లేపే సీన్ చూస్తే అదరహో అనాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కి రోమాలు నిక్కపొడుస్తాయి. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.