తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్ రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’ ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదనే ఇంగిత జ్ఝానం లేదా?..గతంలో నీ మనువడిపై ఆరోపణలొస్తేనే ఖండించిన వ్యక్తిని నేనంటూ సంజయ్ గుర్తు చేశారు.
కేసిఆర్.. ఎవడబ్బ సొమ్మని నిజాం మనువడి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించావ్? అని సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణ వాళ్లను రాచి రంపాన పెట్టి..అత్యాచారాలు.. రాక్షసత్వం ప్రదర్శించిన.. నిజాంపై ప్రేమ చూపించడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.యాదాద్రి ఆలయంపై 1200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి లాభం వస్తుందని నీ కొడుకు(కేటీఆర్) చెప్పడం సిగ్గు చేటన్నారు. హిందూ సమాజం పట్ల కేసీఆర్ కున్న కక్షను ఏ విధంగా తీర్చుకుంటున్నడో… ఈ నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలను చూసి హిందువులంతా సంఘటితం కావలసిన అవశ్యకత ఉందని సంజయ్ పేర్కొన్నారు.
(సంజయ్ కుమారుడి ఘటన రెండు నెలల క్రితం జరిగిందంటూ వైరల్ అవుతున్న పోస్ట్)
“రెండు నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఇది ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు. మొట్టమొదటిసారిగా టి న్యూస్ లోనే ఎందుకు వేశారు.
దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే….
బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి వీడియోలో తన్నులు తింటున్న విద్యార్ధి ఇద్దరు మంచి స్నేహితులు. ప్రస్తుతం కూడా స్నేహితులే. ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే… అదే యూనివర్సిటీలో చదువుతున్న ఒక అమ్మాయి బండి సంజయ్ అంటే రాజకీయ నాయకునిగా బాగా ఇష్టం. అతని కొడుకు అదే యూనివర్సిటీలో చదవడంతో, సాయి భగీరథ్ ను అన్నయ్య అంటూ కలిసేది. ఆపక్కనే వున్న భగీరథ్ స్నేహితుడు (తన్నులు తిన్నవాడు) ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెస్సేజులు పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని భగీరథ్ కు అమ్మాయి వచ్చి చెప్పడంతో, నా చెల్లెలు కు మెస్సేజులు పెడతావా అంటూ ఇగో.. ఇట్లా దేహశుద్ది. ఆ తర్వాత తప్పును ఒప్పుకొని మళ్లీ వీరితో వాడు కలిసి పోయాడు. ఇది రెండు నెలల క్రితం జరిగిన సంఘటన.
ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు “