Newsminute24

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్ర షురూ…

Bandisanjay:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో రేపు ఉదయం 11  గంటలకు  యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర  తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు.  యాత్రలో భాగంగా కోహేడ, చిగురుమామిడి మండల కేంద్రాల్లో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

మరోవైపు ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా బీజేపీ జిల్లా నాయకత్వం రూట్ మ్యాప్ ను ఖరారు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించనుంది.మలిదశ యాత్రలో భాగంగా రేపటి  నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 

 

రెండోరోజు హుస్నాబాద్ రూరల్ మండలంలోని మహ్మదాపూర్, నాగారం, పోతారం, హుస్నాబాద్, పందిళ్ల, గోవర్ధనగిరి, రామవరం, అక్కన్నపేట, అంతక్కపెట, కట్కూర్, మల్లారం, కొత్తకొండ గ్రామాల్లో పర్యటిస్తారు. 3వ రోజు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో, 4, 5 రోజుల్లోఇల్లందకుంట, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్, హుజూరాబాద్ రూరల్ మండలాల్లో 6వ రోజు సైదాపూర్, వీణవంక మండలాల్లో యాత్ర చేస్తారు. మార్చి 2 నాటికి హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్రను పూర్తి చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు. మరోవైపు ప్రజాహిత యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Exit mobile version