Telangana: తెలంగాణకు నిధులివ్వ్డడం లేదని కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ పై కేంద్రం గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో డీఎంకే, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని..ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. లేని సమస్యలను సృష్టించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ లో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాదించడంతో ఆ రెండు పార్టీలకు దిక్కుతోచడం లేదన్నారు. అందుకే అసెంబ్లీలో సస్పెన్షన్ పేరుతో బీఆర్ఎస్ కు మరో ఆయుధాన్ని కాంగ్రెస్ అందించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని జాకీ పెట్టినా లేపినా ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని బండి స్పష్టం చేశారు.
BJPTELANGANA:జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమే : బండి సంజయ్
