BJPTelangana: చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని గౌరవ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా నిలిచిందన్నారు.బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి వీక్షించారు.
‘చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గారికి, 140 కోట్ల మంది భారతీయులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.కేవలం నరేంద్రమోదీ వంటి నాయకుడికి మాత్రమే ఇలాంటి చాలెంజెస్ ను స్వీకరించడం, వాటిని విజయవంతంగా పూర్తిచేసేందుకు కావాల్సిన సంకల్పబలాన్ని శాస్త్రవేత్తలకు అందించగలిగే సామర్థ్యం ఉంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.